Friendship Day గుర్తుండిపోయేలా ఫ్రెండ్స్ కి ఈ బహుమతులు ఇవ్వచ్చు ..!

-

అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం Friendship Day . స్నేహితులకి గుర్తుండిపోయేలా బహుమతులు ఇవ్వాలనుకుంటే ఈ చిన్న చిన్న ఐడియాలను అనుసరించండి. తక్కువ బడ్జెట్ తో ఈ గిఫ్ట్స్ ని మీ స్నేహితులకి ఇవ్వడం వల్ల వాళ్ళు మర్చిపోకుండా ఈ స్నేహితుల దినోత్సవాన్ని గుర్తుపెట్టుకుంటారు. పైగా ఈ గిఫ్ట్స్ అందరికీ నచ్చుతాయి. అయితే మరి కొన్ని గిఫ్టింగ్ ఐడియాస్ ఇక్కడ ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం ఇప్పుడే కొద్దిగా చూసేయండి.

Friendship Day

హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ :

నీ స్నేహం ఎంతో మధురంగా ఉంది అని సింబాలిక్ గా మీరు హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ ని ఇచ్చి విష్ చెయ్యచ్చు. ఇది చాలా బాగా వాళ్లకి నచ్చుతుంది. ఇప్పుడు ఎన్నో రకాల హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ మనకు దొరుకుతున్నాయి. నిజంగా ఇది ఎంతో స్పెషల్ గా ఉంటుంది.

డైరీ:

మీరు మీ స్నేహితులకి డైరీ ఇచ్చి సింబాలిక్ గా జ్ఞాపకాలని ఉంచుకోమని చెప్పొచ్చు. ఇది కూడా వాళ్ళకి బాగా నచ్చుతుంది.

ఫ్రెండ్షిప్ బ్యాండ్ :

అందమైన ఫ్రెండ్షిప్ బ్యాండ్ ని ఒకటే కొనుగోలు చేసి వాళ్ళకి ఇవ్వండి. ఇది కూడా చాలా బాగుంటుంది.

పెండెంట్ :

స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్నేహాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా మీరు పెండెంట్స్ ని కూడా ఇవ్వచ్చు. దాని మీద ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ వంటి వాటిని రాసినవి మీరు డైరెక్ట్ గా కొనుగోలు చేయొచ్చు.

గ్రీటింగ్ కార్డ్ :

మీరు సొంతంగా అందమైన గ్రీటింగ్ కార్డు ఒకటి వాళ్ళకి నచ్చినట్లుగా తయారు చేసి మీరు ఇవ్వచ్చు ఇది కూడా వాళ్ళు తప్పక మర్చిపోకుండా దాచుకుంటారు. ఇలా ఫ్రెండ్షిప్ డే ని తక్కువ బడ్జెట్ తో గుర్తుండిపోయేలా జరుపుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version