పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం గరిష్టానికి చేరుకున్నాయి. రూపాయి పతనంతో పాటు ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశానంటాయి. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం లీటర్ పెట్రలోల్ ధర 16పైపలు పెరిగి, రూ. 78.68కి చేరింది. లీటర్ డీజిల్ ధర 21 పైసలు పెరిగి రూ. 70.42 గా ఉంది. ఇలా ముంబయిలో పెట్రోల్ రూ.86.09 కాగా , కోల్ కతాలో రూ.81.60 కి చేరింది. ఈ ఏడాది మే నెలలో పెట్రోల్, డీజిల్ రికార్డు స్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే.. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు ఉండొచ్చని నిపుణుల అభిప్రాయం.