శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు మూడు గెట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్ ఫ్లో 156656 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 183714 క్యూసెక్కులుగా ఉంది.
జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 883.3 అడుగులుగా ఉంది.
ఎగువ నుంచి వస్తోన్న నీటి కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. దీంతో సాగర్ ఇన్ ఫ్లో 125774 క్యూసెక్కులు ఉండా ఔట్ ఫ్లో 44892 గా ఉంది. నీటి ప్రవాహం ఇదే విధంగా కొనసాగితే మరో 24 గంటల్లో సాగర్ నుంచి నీటిని విడుదలకు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.