ఇంధన ధరలపై సుంకాలు పెంచుతుండటంతో… లీటర్ పెట్రోల్, డీజిల్ పై ఒక రూపాయి చొప్పున సెస్ పెరుగుతోంది. దీని వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి.
ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ 2019ను ప్రవేశపెట్టారు. అయితే.. ఈ బడ్జెట్ లో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచబోతున్నట్టు ఆమె ప్రకటించారు. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. మోదీ ప్రభుత్వంలోనే అత్యధికంగా పెట్రో ధరలు పెరిగాయి. ఇంకా వాటి ధరలు పెరుగుతాయని ఆర్థిక మంత్రి ప్రకటించడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
ఇంధన ధరలపై సుంకాలు పెంచుతుండటంతో… లీటర్ పెట్రోల్, డీజిల్ పై ఒక రూపాయి చొప్పున సెస్ పెరుగుతోంది. దీని వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి.
బంగారం ధరలు కూడా ఆకాశానికి..
మరోవైపు బంగారం ధరలు కూడా ఆకాశానికి అంటనున్నాయి. అవును.. బంగారం దిగుమతులపై కస్టమ్స్ సుంకాలను పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. బంగారంపై ప్రస్తుతం కస్టమ్స్ సుంకం 10 శాతం ఉండగా… దాన్ని 12.5 శాతానికి పెంచుతున్నట్టు ఆమె ప్రకటించారు.