క్రేజీగా సత్యదేవ్ ‘ఫుల్‌బాటిల్‌’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్

-

ఓవైపు హీరోగా.. మరోవైపు విలన్‌గా.. ఇంకోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు టాలీవుడ్ యాక్టర్ సత్యదేవ్. ఇటీవలే రామసేతుతో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి అక్కడి ప్రేక్షుకుల క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. మరోవైపు గాడ్‌ఫాదర్‌లో నెగిటివ్ రోల్‌లో నటించి తన సినీ కెరీర్‌లో మరో మంచిపాత్రను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాల తర్వాత సత్యదేవ్ నెక్స్ట్‌ మూవీ ఏంటా అని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో తన ఫ్యాన్స్‌కి క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు సత్య.

తన నెక్స్ట్ మూవీ ‘ఫుల్‌బాటిల్‌’ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు సత్యదేవ్. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ మూవీలో సత్యదేవ్‌ మెర్క్యూరి సూరీగా కనిపించనున్నాడు. ఈయన లుక్‌ కూడా డిఫరెంట్‌గా ఉంది. ఎస్‌డీ కంపెనీ, శర్వంత్రమ్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌లపై రామాంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జోడీగా సంజనా ఆనంద్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక సత్యదేవ్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ రిలీజ్‌కు రెడీగా ఉంది. దీంతో పాటు ‘కృష్ణమ్మ’ అనే యాక్షన్ సినిమా చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version