పట్టు పురుగులలో సోకే సున్నపుకట్టు రోగం గురించి పూర్తి వివరాలు..!

-

ప్రస్తుతం ఎక్కడ చూసిన వర్షం పడుతుంది.చలి తీవ్రత కూడా రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.ఈ కాలంలో పట్టుపురుగుల పెంపకంలో సున్నపుకట్టు రోగం ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది.ఈ సంవత్సరం కొన్ని ప్రాంతాలలో మంచి వర్షాలు కురిసి, గాలిలో తేమ పెరిగినందున ఈ రోగం పట్టు పురుగులకు ఎక్కువగా సోకేందుకు ఆస్కారముంది. అందువల్ల వర్షాకాలం, చలికాలంలో పురుగులు ఈ రోగ బారిన పడకుండ అవగాహన కల్గి, తగిన ముందు జాగ్రత్త..

ఈ రోగం బావిరియా బాసియానా అనే శిలీంద్రం వల్ల సోకుతుంది. ఇది అంటువ్యాధి. రోగగ్రస్త పురుగులు ఆరోగ్యవంతమైన పురుగుల దేహానికి తగిలినా అంటుకున్నా ఈ రోగం సోకుతుంది. ఈ రోగం పట్టుపురుగు లకే కాక మల్బరీ, ఇతర తోటల్లోని కీటకాలకూ సోకుతుంది..పట్టుపురుగులు మొదట మెత్తబడి చనిపోతాయి. చనిపోయిన పురుగులు దేహం నెమ్మదిగా గట్టిపడి, దేహం నుంచి శిలీంద్రజాలం బయటికి చొచ్చుకొని వచ్చి దేహమంతా తెల్లనిసుద్దముక్కవలె మారుతుంది. పురుగులు మొదట గోధుమరంగుతో గృహ పట్టు కూడిన పింక్ రంగులోకి మారుతాయి. ఈ రంగు ఒకరకమైన బ్యాక్టీరియా (సెర్రిషియా మార్సిసెన్స్) వల్ల వస్తుంది. తరువాత క్రమంగా కొన్ని వల్ల శిలీంద్రజాలం దేహమంతా కప్పి వెలువ ఆ. ఈ తెల్లని సుద్దముక్కవలె మారుతుంది.

రోగ గ్రస్త పురుగులపై ఉన్న అసంఖ్యాక జాగ్రత్త శిలీంద్ర కొనిడియాలు తేలికగా , గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. కొన్నిసార్లు పల్లెలోని రైతుల గృహాల్లోకి కూడా ఇవి వ్యాపిస్తుంటాయి. పురుగుల 5వ దశలో ఒక పురుగు దేహం నుంచి కొన్ని కోట్ల శిలీంద్ర కొనిడియాలు వెలువడుతాయి. ప్రతి ఒక కొనిడియారోగాన్ని కలిగించే సామ ర్థ్యాన్ని కలిగి ఉంటుంది.ఇతర కీటకాలనుంచి ఈ రోగం సోకకుండా పట్టుపురుగులను కాపాడాలి. దీనికోసం మల్బరీ, ఇతర తోటలోని కీటకాలను నివారించాలి. పట్టుపురుగుల పడకల నుంచి రోగగ్రస్థ పురుగులు చనిపోయి గట్టి పడక ముందే వాటిని పక్కకు తీసి కాల్చివేయాలి.. అప్పుడే నివారణ ఉంటుంది..

2 శాతం కాప్టాన్ – సున్నపు పొడి , 2 పాళ్ళ కాప్టాన్ పొడిని 98 పాళ్ళ సున్నపు పొడినందు బాగా కలపాలి. 2 శాతం డైథేన్ ఎం-45 కెవొలిన్ మిశ్రమం: 2 పాళ్ళ డైథేన్ ఎం-45 పొడిని 98 పాళ్ళ కెవొలిన్ పొడి తో కలపాలి…

Read more RELATED
Recommended to you

Exit mobile version