వ్యాక్సిన్ లేదా ఆర్‌టీపీసీఆర్.. ఏ ఆ రాష్ట్రంలోకి వెళ్లాలంటే..

-

కొత్త వేరియంట్ ఓమిక్రాన్ నేపథ్యంలో దేశం మళ్లీ ఆంక్షల చట్రంలోకి వెళ్తున్నట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే, మహారాష్ట్ర ప్రభుత్వం ముంబయి ఏయిర్‌పోర్టుకు వచ్చే దక్షిణాఫ్రికా ప్రయాణికులను క్వారంటైన్ తప్పనిసరి చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులందరూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోవాలని స్పష్టం చేసింది. తాజాగా మరో కఠినమైన నిర్ణయం తీసుకున్నది.

అంతర్జాతీయ ప్రయాణికులతోపాటు స్వదేశీ ప్రయాణికులపై కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాష్ట్రంలో ప్రవేశించే స్వదేశీ ప్రయాణికులు రెండు డోసులు వ్యాక్సిన్ అయినా తీసుకొని ఉండాలి లేదా 72 గంటల ముందు ఆర్‌టీపీసీఆర్ టెస్టు చేసుకొని అయినా ఉండాలి అని తెలిపింది. ప్రతి ఒక్కరూ కొవిడ్-19 మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version