విజయవాడ దుర్గా ఘాట్ లో పాముకు దహన సంస్కారాలు చేశారు దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు. ఇంద్రకీలాద్రి పై గత కొన్నేళ్లుగా రెండు పాములు సంచరిస్తున్నాయి. నిన్న సాయంత్రం ఓం టర్నింగ్ వద్ద ఒక పాము చనిపోయింది. అయితే… మనుషుల మాదిరిగానే ఆ పాముకు దహన సంస్కారాలు చేశారు వైదిక కమీటి సభ్యులు. గతం కొన్ని రోజుల నుంచి భక్తులకు, అర్చకులకు దర్శనమిస్తున్న పాము… ఇటీవల అంతరాలయంలో కనిపించి మాయమైంది.
కొండపైన ఈ రెండు పాములను అత్యంత పవిత్రంగా భావిస్తున్నారు అర్చకులు. అయితే.. నిన్న ఒక పాము చనిపోవడంతో దహన సంస్కారాలు చేశారు వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు. ఆధ్యాత్మిక ప్రాంతాల్లో సర్పాలు చనిపోతే మనుషుల మాదిరిగానే వాటికి కార్యక్రమాలు చేయాలంటున్నారు దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు. అయితే.. ఈ అంత్య క్రియ కార్యక్రమాలను చూసి.. అక్కడి భక్తులు ఆశ్చర్యానికి గురి అయ్యారు. పాము కు కూడా అంత్య క్రియలు చేస్తారా అని నివ్వరబోతున్నారు.