బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు అకాల మరణం పొందాడు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.‘సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గడ్డి నరసయ్య గారి మరణం పార్టీకి తీరని లోటు.
నరసయ్య అకాల మరణం పట్ల చింతిస్తూ.. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.బీఆర్ఎస్ పార్టీ తరఫున వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను’ అని రాసుకొచ్చారు.