గూస్‌బంప్స్ తెప్పిస్తోన్న ‘మంగళవారం’ మూవీ ‘గణ గణ మోగాలిరా’ సాంగ్

-

ఆర్‌ఎక్స్‌ 100 ఫేం సినిమాతో డైరెక్టర్‌గా అజయ్ భూపతి , హీరోయిన్‌గా పాయల్‌ రాజ్‌పుత్‌ మంచి బ్రేక్ అందుకున్నారని తెలిసిందే. ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో చాలా కాలం తర్వాత వస్తున్న చిత్రం మంగళవారం. ఫీ మేల్ ఓరియెంటెడ్‌ సబ్జెక్ట్‌తో హార్రర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. అయితే.. ఈ సినిమా నుంచి కొంత సేపటి క్రితం ‘గణ గణ మోగాలిరా’ అనే ఒక లిరికల్ వీడియో సాంగును విడుదల చేశారు. ‘ అమ్మా హారతి అందుకో .. మమ్ము ఆదుకో, పూజలందుకో .. పుణ్యమిచ్చుకో .. ‘ అంటూ ఈ పాట మొదలవుతోంది. అమ్మవారి జాతర సందర్భంలో వచ్చే పాట ఇది.

అజనీశ్ లోక్ నాథ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఆయన స్వరపరిచిన ఈ పాటకి భాస్కర భట్ల సాహిత్యాన్ని అందించగా, మహాలింగం ఆలపించాడు. జాతర నేపథ్యానికి తగిన బీట్ తోనే ఈ పాట నడుస్తుంది. అజయ్ ఘోష్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ అండ్ గ్లింప్స్ కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు సినిమాపై అంచనాలు కూడా పెంచేశాయి.. ఈ సినిమా పై సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది.. ఇక మంగళవారం నుండి ఫస్ట్ సింగల్ ను ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.. ఆ ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version