హైదరాబాదులో వినాయక విగ్రహాల నిమర్జనం ఉత్సవం పై వివాదం కొనసాగుతూ వచ్చింది. ఎప్పటిలానే హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నా.. హిందూ సంఘాలు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మాత్రం ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ట్యాంక్ బండ్ పై ప్రభుత్వం నిమర్జనాలకు ఏర్పాట్లు చేయడం లేదని ఆరోపిస్తూ ఆందోళనలకు దిగాయి. దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అయితే తాజాగా ఎప్పటిలాగే కార్పొరేషన్ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.
దీంతో హుస్సేన్ సాగర్ చుట్టూ వినాయక నిమర్జనానికి చేసిన ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సంతృప్తి వ్యక్తం చేసింది. నిమర్జనానికి ఏర్పాట్లు చేయాలన్నదే తమ ఆందోళన అన్నారు సమితి సభ్యులు. ఆలస్యంగా నైనా ఏర్పాట్లు పూర్తి చేశారంటూ ప్రభుత్వాన్ని అభినందించారు. ఉత్సవ సమితిలో అన్ని పార్టీల సభ్యులు ఉన్నారని, తమకు రాజకీయాలు అవసరం లేదని, నిమర్జనం ఘనంగా జరగడమే తమ లక్ష్యమని అన్నారు.