హైదరాబాద్ శివార్లలో బీ ఫార్మసీ యువతి గ్యాంగ్ రేప్.. వెలుగులోకి సంచలన అంశాలు !

-

హైదరాబాద్ శివార్లలో ఉన్న ఘాట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మేడ్చల్ లోని సీ.ఎం.అర్ కళాశాలలో బీ.ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్న యువతి నిన్న అత్యాచారానికి గురయ్యిందని చెబుతున్నారు.  కీసర పోలీస్ స్టేషన్ పరిధి నాగరం చౌరస్తాలో కళాశాల బస్సు దిగి ఆర్ ఎల్ నగర్ కాలనీలోని ఇంటికి వెళ్ళడానికి యువతి సెవన్ సీటర్ ఆటో ఎక్కింది. అయితే యువతి ఒంటరిగా ఉండడం గమనించి ఆటో డ్రైవర్ ఘాట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యంనంపేట్ లో మరో ముగ్గురు యువకులను ఆటోలో ఎక్కించుకున్నాడని చెబుతున్నారు.

అనంతరం జోడిమెట్ల వద్ద పొదల్లోకి తీసుకెళ్ళి యువతి పై ఆటో డ్రైవర్ అతని స్నేహితులు  అత్యాచార చేశారని బాధిత యువతి చెబుతోంది. ఆ తరువాత అమ్మాయిని రోడ్డు పక్కన పడేసి ఆటో డ్రైవర్ అతని స్నేహితులు అక్కడి నుండి ఉడాయించినట్టు చెబుతున్నారు.  బాధితురాలు అపస్మారక స్థితిలోకి పోవడంతో మెరుగైన చికిత్స కోసం నారపల్లీలోని క్యూర్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఆసుపత్రిలో అమ్మాయి  స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. అయితే పోలీసులు మాత్రం ఆమె మీద అత్యాచార యత్నం జరిగిందని అత్యాచారం జరగలేదని చెబుతున్నారు. దీనికి సంబంధించి మరికొద్దిసేపటిలో అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version