ఏపీలో పసిపిల్లల అమ్ముతున్న ముఠా అరెస్ట్

-

ఏపీలో పసిపిల్లలను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. ఆస్పత్రిలో పనిచేస్తూ మాయమాటలు చెప్పి పసికందులను ఇతరులకు విక్రయిస్తున్న ఓ జంటను మంగళగిరి పట్టణ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 15 రోజుల పసికందును స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ జోడుబొమ్మల సెంటర్‌కు చెందిన బొమ్మిడి ఉమాదేవి, త్రినాథ్ దంపతులు రూ.4.60 లక్షలకు ఆ పసికందును కొనుగోలు చేసి రూ.5 లక్షలకు విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పట్టణ సీఐ వినోద్ తెలిపారు.

ఆ చిన్నారి నిజమైన తల్లిదండ్రులెవరు..? ఈ ముఠా వెనుకున్న అసలు పాత్రధారులు ఎవరు? అన్న విషయాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు.ఈ ముఠా వెనుక హైదరాబాద్‌కు చెందిన మరో జంట ఉందని, వారిదే కీ రోల్ అని.. ప్రస్తుతం వారి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. వీరు పట్టుబడితే కేసు చిక్కుముడి వీడే చాన్స్ ఉందని సీఐ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version