మళ్ళీ వాయిదా ప‌డిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’.. కొత్త రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే..?

-

టాలీవుడ్ మాస్‌ కా దాస్ విశ్వక్‌సేన్  తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ మళ్ళీ వాయిదా ప‌డింది. ఇప్ప‌టికే ఈ సినిమా చాలాసార్లు వాయిదా ప‌డుతూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. మొద‌ట ఈ మూవీని గ‌తేడాది డిసెంబర్‌ 8న విడుదల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేశారు. అయితే అనుకోని కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది. అనంత‌రం మార్చి 8న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు ప్ర‌క‌టించారు. అయితే మార్చి నెల‌లో ఈ సినిమా విడుద‌ల‌వ్వ‌లేదు కానీ ‘గామి’ మాత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.రీసెంట్‌గా తెలంగాణ లోక్‌స‌భ ఎన్నిక‌ల అనంత‌రం మే 17న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

కానీ మ‌ళ్లీ ఈ సినిమా విడుద‌ల తేదీని వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమాను మే 31న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు విశ్వక్‌సేన్ ఎక్స్ వేదిక‌గా ప్ర‌క‌టించాడు. ఫలక్‌నుమా దాస్ విడుద‌లైన మే 31 తేదీనే ఈ సినిమాను కూడా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపాడు. విశ్వక్‌సేన్ ప్ర‌ధాన‌పాత్ర‌లో వ‌స్తున్న ఈ చిత్రానికి ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వ‌హిస్తున్నాడు. డీజే టిల్లు ఫేం నేహాశెట్టి  హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుద‌ల చేయ‌గా.. ప్రేక్ష‌కుల వ‌ద్ద నుంచి మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version