గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. ఈ నిరసనలో పాల్గొన్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. భారతదేశానికి మోడీ ప్రధాని కావడమే మన దురదృష్టకరమని అన్నారు. మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తికావడంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరోసారి పేద, మధ్యతరగతి ప్రజలపై ఊహించని భారాన్ని మోపింది అన్నారు.
ప్రధాని మోదీ మిత్రుడు అదానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకే గ్యాస్ ధరల పెంపు అని ఆరోపించారు గంగుల కమలాకర్. 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో సిలిండర్ పై ఒక ఏడాదికి వంద రూపాయలు పెంచిన ఘనత కేవలం ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు. ధరల పెంపుపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. పేద, మధ్య తరగతి ప్రజల బాధలను పట్టించుకోవడం లేదన్నారు. గడిచిన ఎనిమిది సంవత్సరాల లో సిలిండర్ పై 800 రూపాయలు పెంచిన మహానుభావుడు ప్రధాని మోదీ అన్నారు.