#GanjaOdhuBro: గంజాయిపై టీడీపీ పోరాటం..కలిసొస్తుందా?

-

ఏపీలో ప్రతిపక్ష టీడీపీ అనేక ప్రజా సమస్యలపై వరుస పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. పెరిగిన ధరలపై బాదుడే బాదుడు అంటూ కార్యక్రమం చేపట్టింది..అలాగే రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కుంటుపడిందని, అరాచకాలు పెరిగిపోయాయని, ప్రశ్నించిన వారిపై కేసులు, దాడులు, వైసీపీ నేతల అక్రమాలు, అప్పుల భారం, ఉద్యోగులకు జీతాలు లేవు, ప్రజలపై పన్నుల భారం..ఇలా రకరకాల సమస్యలపై టి‌డి‌పి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ ప్రోగ్రాం పెట్టి ముందుకెళుతుంది.

ఇక పోరాటాలు సక్సెస్ అవుతూ వస్తున్నాయి. అయితే రాష్ట్రాన్ని…ముఖ్యంగా యువతని నాశనం చేస్తున్న గంజాయిపై టి‌డి‌పి పోరాటం మొదలుపెట్టింది. గంజాయి వల్ల యువత భవిష్యత్ నాశనం అవుతుందని,  జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వ్యవసాయం రంగం కుదేలయినా గంజాయి సాగులో మాత్రం ఏపీ దేశంలోనే  నెంబర్ 1 స్థానంలో ఉందని, ఉత్పత్తుల తయారీ, ఎగుమతుల్లో లేకపోయినా గంజాయి సరఫరాలో మాత్రం ఏపీనే నెంబర్ 1 అని,  గంజాయి విక్రయాల్లో కూడా ఏపీదే అగ్రస్థానమని టి‌డి‌పి నేతలు ఆరోపిస్తున్నారు.

ఇదే క్రమంలో #GanjaOdhuBro అంటూ టి‌డి‌పి కొత్త పోరాటం మొదలుపెట్టింది. శింగనమలలో లోకేష్ పాదయాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. పాదయాత్రలో గంజాయికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. లోకేష్ పాదయాత్రలో బాలయ్య కూడా పాల్గొన్నారు. గంజాయి వద్దు బ్రో అంటూ రాసి ఉన్న క్యాప్, టీ షర్టులను లోకేశ్, బాలకృష్ణ పాదయాత్రలో ధరించి యువత డ్రగ్స్‎కి దూరంగా ఉండాలి అంటూ మెసేజ్ ఇస్తున్నారు.

గంజాయి ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్‎గా మారిందని, సీఎం జగన్ పాలనలో ఏపీ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిందని, ఆఖరికి తిరుమలని కూడా వైసీపీ గంజాయి మాఫియా వదలడం లేదని ఫైర్ అయ్యారు. పాదయాత్రలో ఉండగా చంద్రగిరిలో ఒక తల్లి వచ్చి తన కుమార్తె గంజాయికి బానిస అయ్యిందని ఆవేదన వ్యక్తం చేసిందని, ఆ తల్లి చెప్పిన మాటలు తనని కలచివేశాయని,  అందుకే గంజాయికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం మొదలుపెట్టామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version