గంటా చాణక్యం: బాబు-పవన్ జట్టు? 

-

రాజకీయాల్లో సమయానికి తగ్గట్టు రాజకీయం చేసి సక్సెస్ అవ్వడంలో గంటా శ్రీనివాసరావుని మించిన నాయకుడు లేరనే చెప్పాలి..ఈ సమయంలో ఎలా రాజకీయం చేయాలో గంటాకు బాగా తెలుసు. ఇంతకాలం అలాగే రాజకీయం చేసి సక్సెస్ అవుతున్నారు. అందుకే ఇంతవరకు ఆయన ఓడిపోలేదు. ఎన్ని పార్టీలు మారినా, నియోజకవర్గాలు మారినా సరే గంటాకు ఓటమి రాలేదు.
అయితే గత ఎన్నికల్లో కూడా గంటా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే…కాకపోతే టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో సైలెంట్ అయిపోయారు..అదే సమయంలో వైసీపీలోకి వెళ్లడానికి కూడా ట్రై చేశారు…కానీ అది కుదరలేదు. ఇక ఇటీవల మళ్ళీ టీడీపీలో యాక్టివ్  అయ్యారు…నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇలా టీడీపీలో యాక్టివ్ అయిన గంటా…ఇంకా వైసీపీ వైపుకు వెళ్ళే అవకాశం లేదని తెలుస్తోంది.
అదే సమయంలో వైసీపీకి చెక్ పెట్టాలంటే టీడీపీ-జనసేనలు కలవాలనేది గంటా కాన్సెప్ట్..అందుకే ఇటీవల ఆ దిశగా గంటా ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలిసింది. ఆ మధ్య కాపు నేతల సమావేశం జరిగిన విషయం తెలిసిందే…గంటానే లీడ్ తీసుకుని కార్యక్రమం నడిపించినట్లు తెలుస్తోంది..కాపులకు అధికారమే లక్ష్యంగా ఆ సమావేశం జరిగింది.
కాకపోతే ఇప్పుడున్న పరిస్తితుల్లో కాపు నేతలు సెపరేట్‌గా పార్టీ పెట్టి సక్సెస్ అవ్వడం కష్టం..అదే సమయంలో జనసేనని పైకి లేపడం కష్టమే. మరి ఇలాంటి పరిస్తితుల్లో చాకచక్యంగా ముందుకెళ్లాలనేది గంటా ఆలోచన.. ఒంటరిగా అధికారం దక్కించుకోవడం కష్టం కాబట్టి..అదే టీడీపీతో కలిస్తే అధికారం షేర్ చేసుకోవచ్చనేది గంట ఆలోచనగా ఉంది.
అంటే చంద్రబాబు-పవన్ జట్టు కడితే జగన్ చెక్ పెట్టి అధికారం తెచ్చుకోవచ్చని గంటా ప్లాన్ చేస్తున్నారు..ఆ దిశగానే ఇప్పుడు పొత్తు సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఎలాగో బాబుతో క్లోజ్‌గా మాట్లాడే చనువు గంటాకు ఉంది..అటు జనసేన నేతలతో గంటాకు పరిచయాలు ఉన్నాయి. కాబట్టి టీడీపీ-జనసేనలు పొత్తు సెట్ చేయాలని గంటా గట్టిగానే ట్రై చేస్తున్నారు. మరి చూడాలి టీడీపీ-జనసేనల పొత్తు సెట్ అవుతుందో లేదో.

Read more RELATED
Recommended to you

Exit mobile version