వెండితెరపై అలాగే బుల్లితెర లోనూ… నటీనటుల మధ్య ప్రేమ వ్యవహారాలు అదే రీతిలో పెళ్లిళ్లు చాలా సహజం. ఇప్పటికే చాలామంది స్టార్ నటులతో పాటు బుల్లితెర నటులు కూడా ప్రేమించి వివాహాలు చేసుకున్నారు.
కొంతమంది ఇది తమ అన్యోన్య జీవితాన్ని… చాలా ఆనందంగా గడుపుతుంటే… మరికొంతమంది మాత్రం విడాకులు తీసుకుంటున్నారు.ఎక్కువ మంది సెలబ్రెటీలు మాత్రం వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
ఇది ఇలా ఉండగా తాజాగా.. బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న ఇద్దరూ పెళ్లికి రెడీ అయిపోయారు. ఒకరు జబర్దస్త్ కామెడీ షో లో అలరించే రాకింగ్ రాకేష్ కాగా మరొకరు బిగ్ బాస్ బ్యూటీ సుజాత.
వీరిద్దరూ ప్రస్తుతం జబర్దస్త్ స్కిట్స్ చేస్తూ అందరినీ కడుపుబ్బ నవ్విస్తున్నారు.ఈ మధ్యకాలంలో ఈటీవీ లో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం లోనూ ఇద్దరు పాల్గొన్నారు.
వాలెంటెన్స్ డే రోజున ప్రసారమైన ఈ కార్యక్రమంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు తమ ప్రేమను వెల్లడించారు. అదే వేదిక పై రింగ్ ఇచ్చి ప్రపోస్ చేశాడు రాకింగ్ రాకేష్. సిగ్గుల ముగ్గు అయిన సుజాత కూడా వెంటనే ఓకే చెప్పేసింది.
దీంతో ఆ ఇద్దరికీ నిశ్చితార్థం అయినట్లేనని అభిమానులు భావిస్తున్నారు. ఇంకా త్వరలోనే ఇద్దరూ పెళ్లి పీటలు కూడా ఎక్కనున్నారని సమాచారం అందుతోంది. తాజాగా ఈ విషయాన్ని జబర్దస్త్ కమెడియన్ బాబు ఇంటర్వ్యూ లో కన్ఫామ్ కూడా చేశాడు.
సుజాత అలాగే రాకేష్ ఈడు జోడు చాలా బాగుంటుందని ప్రశంసించాడు. వాళ్లిద్దరూ ఒకరి నొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లే వ్యక్తులని చెప్పాడు. ఈ ఏడాదిలోనే వారిద్దరికీ వివాహం జరుగుతుందని కూడా స్పష్టం చేశాడు.