వైసీపీలో చేరికపై గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు

-

వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి గంటా శ్రీనివాసరావుకు ముహూర్తం ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ లోనే.. గంటా..జగన్ సమక్షంలో వైసీపీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే తన అనుచరులకు గంటా క్లియర్ గా చెప్పేశారని వార్తలు వచ్చాయి. అయితే.. తాజాగా ఈ వ్యవహారంపై గంటా స్పందించినట్లు టీడీపీ నేతలు ఓ వీడియోను వైరల్‌ చేస్తున్నారు.

తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వీడియో ఒకటి వైరల్ అవుతుంది. గంటా పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చారని, టిడిపిలో కొనసాగుతానని చెబుతున్నట్లు తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ‘నేను రాజకీయాల్లో ఉన్నంతవరకు చంద్రబాబు గారితోనే నా ప్రయాణం, తెలుగుదేశం పార్టీలోనే ఉంటా, తెలుగుదేశం పార్టీ విజయం కోసం పని చేస్తా, సోషల్ మీడియాలో ఏవేవో రాస్తుంటారు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. అయితే, ఆ వీడియో పాతదని.. ఎప్పటి వీడియోనో ఇప్పుడు వైరల్‌చేస్తున్నారు కొందరు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా.. గంటా దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా మాట్లడలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version