కేటీఆర్ ను అరెస్ట్‌ చేస్తే..రూ.100 కోట్లతో బీఆర్‌ఎస్‌ స్కెచ్‌ – ఆది శ్రీనివాస్

-

కేటీఆర్ ను అరెస్ట్‌ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను ఏసీబీ అరెస్ట్ చేస్తే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని కేటీఆర్ అనుచరుడు శ్రీధర్ ఆదేశాలిచ్చినట్లు మాకు సమాచారం ఉందని బాంబ్‌ పేల్చారు. ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు తగలబట్టి అల్లర్లు, దాడులు, ధర్నాలు చేసేందుకు సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారని కేటీఆర్ ను అరెస్ట్‌ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Government Whip Adi Srinivas sensational comments

ఒక్కో నియోజకవర్గానికి రూ.2 కోట్ల చొప్పున ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు డబ్బు పంపించారని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కన్నేసి ఉంచాలని తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. దీంతో… కేటీఆర్ ను అరెస్ట్‌ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ అయ్యాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version