వాళ్ళని చంపేయమని ట్వీట్ చేసిన గంభీర్…!

-

నిర్భయ నిందితుల ఉరి శిక్ష అమలులో వాయిదా పడటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనిపై మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ లో గంభీర్ తన అసహనాన్ని వ్యక్తం చేసాడు. ‘‘దారుణం జరిగి ఏడేళ్లయ్యింది.. ఒక తల్లి నిరీక్షణ ఇంకెన్నాళ్లు? వెంటనే ఉరితీయండి’’ అని గంభీర్ ట్వీట్ చేసాడు. అలాగే మరికొన్ని వ్యాఖ్యలు చేసాడు గంభీర్.

ఈ క్రూరమృగాలు జీవించడానికి లభిస్తున్న ప్రతిరోజూ, న్యాయవ్యవస్థకు మాయని మచ్చలాంటిదని అంటూ ట్వీట్ చేశారు గంభీర్. నిర్భయ హత్య కేసు నిందితుల ఉరి శిక్షపై పాటియాలా హౌస్ కోర్ట్ స్టే విధించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి డెత్ వారెంట్ ప్రకారం ఈ రోజు ఉదయం ఆరు గంటలకు వారిని ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉరి తీయాల్సి ఉంది. అయితే దీనిపై స్టే విధించడంతో ఉరి వాయిదా పడింది.

త్వరలోనే తేదీని ప్రకటించనున్నారు. దీనిపై దేశ వ్యాప్తంగా అసహనం వ్యక్తమవుతుంది. రాజకీయాలు, చట్టాలు దోషులను బ్రతికిస్తున్నాయి అంటూ పలువురు వ్యాఖ్యలు చేసారు. వాళ్ళను ఇంకెన్నాళ్ళు జైల్లో ఉంచి మేపుతారు అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు పలువురు. వారికి అసలు బ్రతికే అర్హత లేదని, అలాంటి మృగాలు నిర్భాయని రేప్ చేస్తే మన చట్టాలు నిర్భయ ఆత్మని రేప్ చేశాయని కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version