తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్‌.. నేటి నుంచి గాంధీలోనే జీనోమ్ సీక్వెన్సింగ్‌ టెస్టులు

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు.. ఆరోగ్య శాఖ తీపి క‌బురు చెప్పింది. ఇవాళ్టి నుంచి గాంధీ ఆస్ప‌త్రి లోనే జీనోమ్ సీక్వెన్సింగ్ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఈ విష‌యాన్ని స్వ‌యంగా.. హైద‌రాబాద్ గాంధీ ఆస్ప‌త్రి సూపరిండెంట్ రాజారావు ప్ర‌క‌ట‌న చేశారు. క‌రోనా మ‌హ‌హ్మ‌రి వేరియంట్ల స్టడీ కోసం… ఇన్ని రోజుల నుంచి… పూణే లోని వైరాల‌జీ ల్యాబ్ కు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ పంపించేది.

దీని వ‌ల్ల ప‌రీక్షా ఫలితాలు వ‌చ్చే స‌రికి చాలా స‌మ‌యం ప‌ట్టేది. అలాగే.. కొన్ని ప‌రీక్ష ఫ‌లితాలు తారుమారు కూడా అయ్యేవి. ఈ త‌రుణంలోనే.. ఇవాళ్టి నుంచి గాంధీ ఆస్ప‌త్రి లోనే జీనోమ్ సీక్వెన్సింగ్ ప‌రీక్ష‌లు ప్రారంభించారు. దీంతో… తెలంగాణ ప్ర‌జ‌ల‌కు చాలా వ‌ర‌కు స‌మ‌స్య‌లు త‌ప్ప‌నున్నాయి.

కాగా.. గ‌డిచిన 24 గంట‌ల‌లో తెలంగాణ రాష్ట్రంలో కొత్త గా 134 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో తెలంగాణ లో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా కేసుల సంఖ్య 6,79,564 కి చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version