LIC నుండి కొత్త పాలసీ.. రూ.100 పెట్టుబడితో పది లక్షలు..!

-

చాలా మంది ఎల్‌ఐసి అందించే ప్రయోజనాలని పొందుతున్నారు. ఈ పథకాలలో డబ్బులు పెడితే మంచిగా బెనిఫిట్ ని పొందొచ్చు. LIC ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. పైగా చాలా ప్లాన్స్ ని కూడా అందిస్తోంది. వీటిలో డబ్బులని పెడితే చక్కగా భవిష్యత్తు లో ఏ బాధ లేకుండా ఉండచ్చు. చిన్న మొత్తాల్లో పొదుపు చేసి అధికంగా రిటర్న్స్ పొందేందుకు కూడా అవుతుంది. భారతీయ జీవిత భీమా సంస్థ అంటే రిస్క్ ఏ ఉండదు. పూర్తి సేఫ్.

ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ పేరు తో ఎల్ఐసీ ఓ పాలసీ ని తీసుకు వచ్చింది. ప్రతి రోజూ రూ.100 చొప్పున పదిహేను సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే డబుల్ బోనస్ వస్తుంది. రాబడికి హామీ ఇవ్వడమే కాకుండా బీమా కవరేజీ కూడా ఇస్తోంది. అలానే మంచి బెనిఫిట్స్ ని కూడా ఇస్తోంది. ఇక ఈ పాలసీ కి అర్హులు ఎవరు అనేది చూస్తే.. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. రోజుకు రూ.100 తక్కువ పెట్టుబడి పెడితే నిర్ణీత మొత్తంలో రిటర్న్స్ వస్తాయి.

ఐదు లక్షల హామీ మొత్తాన్ని పొందొచ్చు. 8.60 లక్షల రివిజనల్ బోనస్ వస్తుంది. లాభాలను రెట్టింపు చేయడానికి 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. అప్పుడు మాత్రమే డబుల్ బోనస్‌ను పొందేందుకు అవుతుంది. ఎల్‌ఐసి జీవన్ ఆనంద్ పాలసీ లో పెట్టుబడి పెట్టడానికి వార్షిక ప్రీమియంగా రూ. 27,000 డిపాజిట్ చెయ్యాలి. నెలవారీ ప్రీమియం దాదాపు రూ. 2300 గా ఉంటుంది. 21 ఏళ్ల లో దాదాపు రూ.5.60 లక్షలు జమ అవుతాయి. బోనస్ తో కలిపి మొత్తం మీకు పది లక్షలు వస్తాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version