కేంద్రం నుండి సూపర్ స్కీమ్.. ఆడ పిల్ల పుడితే రూ.21 వేలు..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తెచ్చింది. ఈ స్కీముల వలన చాల మందికి ప్రయోజనం కలుగుతోంది. అమ్మయి పుడితే కుటుంబాలకు ఆర్థిక మద్దతు ని కూడా కేంద్రం ఆఫర్ చేస్తోంది. అమ్మాయిల భవిష్యత్‌కు భరోసా ఇవ్వడానికి.. ఆడపిల్ల పుడితే.. వాళ్ళ పేరు మీద డబ్బులు డిపాజిట్ చేస్తోంది. దాదాపు చాలా రాష్ట్రాలు అమ్మాయి పుడితే వారికి ఆర్థిక భద్రత కల్పించే స్కీమ్స్‌ను తీసుకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఒక సూపర్ స్కీమ్ ని తెచ్చింది. దాని గురించి ఇప్పుడు చూసేద్దాం.

అమ్మాయి పుడితే రూ. 21 వేలు ఈ స్కీమ్ కింద వస్తాయి. ఆప్‌కీ బేటి, హమరీ బేటి అనే స్కీమ్ ఇది. ఇది 2015లోనే ప్రారంభం అయ్యింది. ప్రభుత్వం రూ. 21 వేలు ని ఈ స్కీమ్ తో అందిస్తోంది. బాలబాలికల మధ్య లింగ నిష్పత్తి వ్యత్యాసాన్ని తగ్గించడం, భ్రూణ హత్యలు వంటి నేరాలను నిరోధించడం కోసమే దీన్ని తీసుకొచ్చారు. లైఫ్ న్సూరెన్స్ కార్పరొషన్ ఆఫ్ ఇండియా తో దీన్ని తీసుకు వచ్చారు.

పుట్టిన పాప పేరుపై రూ. 21 వేల మొత్తాన్ని ప్రభుత్వం ఎల్ఐసీలో ఇన్వెస్ట్ చేస్తుంది. 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. షెడ్యూల్డ్ క్యాస్ట్, బీపీఎల్ కుటుంబాలకు ఈ స్కీమ్ వలన ప్రయోజనం కలుగుతుంది. కచ్చితంగా హరియాణలో జన్మించి ఉంటేనే ఈ స్కీమ్ కి అర్హులు. wcdhry.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈ పథకంలో చేరొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version