LIC: రూ. 323 పొదుపుతో.. 76 లక్షలు..!

-

దేశీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ లో చాలా మంది డబ్బులు పెడుతున్నారు. LIC ఎన్నో రకాల పాలసీలు, పథకాలు అందిస్తోంది. దీనితో చాలా మంది మంచి రాబడిని పొందుతున్నారు. ఎలాంటి రిస్క్ ఉండదు. మీరు సరైన పాలసీ ని ఎంచుకుంటే మీరు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఎల్ఐసీ అందిస్తున్న వాటిల్లో బీమా రత్న పాలసీ కూడా ఒకటి. బీమా రత్న పాలసీ తో చక్కటి లాభాల ని పొందొచ్చు. మరి ఇక అదేమిటో తెలుసుకుందాం.. జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ అందిస్తున్న బీమా రత్న పాలసీ లో డబ్బులు పెడితే బీమాకు బీమా రాబడికి రాబడి ఉంటుంది. మెచ్యూరిటీ నాటికి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. మనీ బ్యాక్ పాలసీ ఇది. ఈ పాలసీ తో బోనస్ కూడా లభిస్తుంది.

ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయానికి ఏకంగా రూ.76 లక్షల మీ చేతికి వస్తాయి. రూ.5 లక్షల కనీస మొత్తంతో మీరు ఈ పాలసీ తీసుకోవచ్చు. గరిష్ఠ పరిమితి ఏమీ లేదు. 90 రోజుల నుంచి 55 ఏళ్ల వరకు వయసు వున్నవాళ్లు ఎవరైనా ఈ పాలసీ ని తీసుకోవచ్చు. ప్రీమియం మొత్తాన్ని నెల, మూడు నెలలు, ఆరు నెలలు, వార్షిక పద్ధతుల్లో కట్టచ్చు. 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్ల టెన్యూర్‌తో ఈ పాలసీని తీసుకోవచ్చు. ఎంచుకున్న టెన్యూర్ కంటే నాలుగేళ్లు తక్కువగా ప్రీమియం ని చెల్లించాలి. 15 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ ఎంచుకుంటే ప్రీమియం 11 ఏళ్లు కట్టాలి.

20 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటే 16 ఏళ్లు, 25 టెన్యూర్ ఎంచుకుంటే 21 ఏళ్లు ప్రీమియం ని కట్టాలి. 25 ఏళ్ల కాలవ్యవధితో రూ.20 లక్షల హామీ మొత్తంతో పాలసీ ని తీసుకుంటే ఏడాదికి రూ.1.18 లక్ష ప్రీమియం. రోజుకు 323 రూపాయలు. సర్‌వైవల్ బెనిఫిట్ కింద 23వ ఏడాది, 24వ ఏడాదిలో రూ.5 లక్షల వస్తాయి. 25 ఏళ్ల టెన్యూర్ పూర్తి అయ్యాక గ్యారంటీ అడిషన్స్ కింద రూ.28.5 లక్షలు, మెచ్యూరిటీ బెనిఫిట్ కింద మరో రూ.38.5 లక్షలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version