LIC: ఒక్కసారి డబ్బులు పెడితే చాలు.. ప్రతీ నెలా పెన్షన్.. పూర్తి వివరాలు ఇవే..!

-

చాలా మంది భవిష్యత్తులో ఏ ఇబ్బంది రాకూడదని అనుకుంటూ వుంటారు. ఏ సమస్యా ఉండకూడదని నచ్చిన పథకాల్లో డబ్బులు పెడుతున్నారు. ఇలా డబ్బులని పెడితే మంచిగా భవిష్యత్తులో ఏ ఇబ్బంది లేకుండా హాయిగా ఉండచ్చు. మంచి రాబడిని అందించే స్కీమ్స్ LICలో చాలా ఉన్నాయి. వీటిలో డబ్బులని పెట్టి రిటైర్‌మెంట్‌ తర్వాత పెన్షన్ పొందొచ్చు. జీవన్ శాంతి పాలసీ ని కూడా LIC అందిస్తోంది. పరిమిత మొత్తంలో పెట్టుబడి పెట్టి ఈ పాలసీ నుంచి ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఇక పూర్తి వివరాలు చూసేద్దాం.

LIC తీసుకు వచ్చిన ప్లాన్స్ లో జీవన్ శాంతి పాలసీ యాన్యుటీ ప్లాన్ కూడా ఒకటి. దీన్ని కొనుగోలు చేస్తే నిర్ణీత మొత్తంలో పెన్షన్‌ మీకు వస్తుంది. ఈ పాలసీ ద్వారా ప్రతి నెలా పెన్షన్ ని మీరు పొందొచ్చు. రెండు రకాల ఆప్షన్‌లు దీనిలో ఉన్నాయి. డిఫర్డ్‌ యాన్యుటీ ఫర్‌ సింగిల్ లైఫ్, యాన్యుటీ ఫర్‌ జాయింట్ లైఫ్ రెండూ వున్నాయి. మొదటి ఆప్షన్‌ ని కనుక మీరు సెలక్ట్‌ చేసుకుంటే ఒక వ్యక్తికి మాత్రమే పెన్షన్ స్కీమ్‌ కొనుగోలు చేయవచ్చు. అదే మీరు రెండోది జాయింట్ స్కీమ్ ఎంచుకుంటే ఒకరి కంటే ఎక్కువ మంది కొనచ్చు. 30 నుంచి 79 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు కనీసం రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్‌ చేసి ఈ పాలసీ ని కొనచ్చు. ఏ సమయంలో పాలసీ వద్దని భావించినా సరెండర్ చేయవచ్చు.

ఎల్‌ఐసీ నుంచి లోన్ కూడా తీసుకోవచ్చు. డిఫర్డ్‌ యాన్యుటీ ఫర్‌ సింగిల్‌ లైఫ్‌ స్కీమ్‌లో రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే నెలకి పెన్షన్ కింద రూ.11,192 లభిస్తుంది. ఒకవేళ రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.1,000 పెన్షన్ లభిస్తుంది. సంవత్సరానికి, 6 నెలలు, 3 నెలలు లేదా నెలవారీని బట్టీ ఆప్షన్‌లు ఉన్నాయి. పెన్షన్‌ను వెంటనే తీసుకోవచ్చు. ఒక సంవత్సరం నుంచి 20 సంవత్సరాల మధ్య ఎప్పుడైనా దీన్ని ప్రారంభించవచ్చు. డిఫెర్డ్ యాన్యుటీ ఫర్‌ సింగిల్‌ లైఫ్‌ పాలసీని తీసుకుని ఏమైనా కారణాలతో మరణిస్తే పాలసీలో ఇన్వెస్ట్‌ చేసిన డబ్బు నామినీకి వెళ్తాయి. పాలసీదారు జీవించి ఉంటే నిర్దిష్ట సమయం తర్వాత పెన్షన్ ని పొందవచ్చు. జాయింట్ లైఫ్ పాలసీలో ఒకరు మరణిస్తే మరొకరు పెన్షన్ పొందుతూనే ఉంటారు. ఒకవేళ ఇద్దరు వ్యక్తులు మరణిస్తే డిపాజిట్ చేసిన డబ్బును నామినీ అందుకుంటారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version