పొంగులేటిపై కమలం కన్ను..ఖమ్మంలో కలిసొస్తుందా?

-

ఎట్టకేలకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. ఆయనని బీజేపీలో లాగడానికి ఈటల రాజేందర్ రెడీ అయ్యారు. పొంగులేటితో భేటీ అవుతున్నారు. ఇక ఈటలకు పొంగులేటి లంచ్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో పొంగులేటి బి‌జే‌పిలో చేరడం ఖాయమని తెలుస్తోంది. ఇక పొంగులేటిని బి‌జే‌పిలో చేర్చుకుంటే..ఖమ్మంలో పార్టీకి పట్టు పెరుగుతుందని భావిస్తున్నారు.

అయితే ఖమ్మంలో బి‌జే‌పికి పెద్ద పట్టు లేదు..చెప్పుకోవడానికి బలమైన నేత లేరు. ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్లు కోల్పోవడమే. అలాంటి పరిస్తితి ఖమ్మంలో ఉంది. అందుకే పొంగులేటి బలమైన నాయకుడని లాగాలని చూస్తున్నారు. పొంగులేటికి జిల్లాలో 10 స్థానాల్లో బలమైన వర్గం ఉంది. అనుచరులు ఉన్నారు. దీని వల్ల పొంగులేటికి ఖమ్మంపై పట్టు ఉంది. బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఆయన నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశమయ్యి, ఆయా స్థానాల్లో పట్టు పెంచుకుంటున్నారు. అలాగే తన అనుచరులకు సీట్లు కూడా ఫిక్స్ చేసేసుకుంటున్నారు.

కానీ పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని, ఆ పార్టీ నేతలు కూడా ట్రై చేస్తున్నారు. కాకపోతే పొంగులేటి వస్తే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది గాని, అయితే ఆయన అనుచరులకు సీట్లు వస్తాయో లేదో గ్యారెంటీ లేదు. ఎందుకంటే జిల్లాలో కాంగ్రెస్ బలంగానే ఉంది..బలమైన నాయకులు ఉన్నారు. దీని వల్ల పొంగులేటి అనుచరులకు సీట్లు దక్కడం కష్టం. అదే సమయంలో బి‌జే‌పిలోకి వస్తే మాత్రం సీట్లు దక్కే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బి‌జే‌పికి జిల్లాలో పట్టు లేదు..పోటీ చేయడానికి సరైన నాయకులు లేరు.

ఇక పొంగులేటి బి‌జే‌పిలో చేరికపై ఈటల అన్నీ క్లియర్ గా మాట్లాడనున్నారు. తనతో పాటు తన అనుచరులకు సీట్లు ఖాయమైతే పొంగులేటి బి‌జే‌పిలో చేరిపోయే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక పొంగులేటి బి‌జే‌పిలోకి వస్తే..ఖమ్మంలో ఆ పార్టీకి పట్టు పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version