వాస్తు ప్రకారం నడుచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. నెగటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయిపోతుంది. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ వాస్తు ని అనుసరిస్తున్నారు దీని వల్ల మంచిగా సమస్యలు లేకుండా ఉంటున్నారు. మీరు కూడా వాస్తు చిట్కాలను అనుసరించాలి అని అనుకుంటున్నారా వాస్తు ద్వారా సమస్యలేమీ లేకుండా ఉండాలి అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా పండితులు చెబుతున్న విషయాలను చూడాలి.
వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గది లో ఎలాంటి నియమాలను పాటించాలి అనేది పండితులు చెప్పారు. మరి వాటి కోసం ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో పూజ చేసేటప్పుడు మన వెనక భాగం ఎప్పుడూ కూడా ఆ దేవుడు వైపు ఉండకూడదు ఎప్పుడూ కూడా మనం దేవుడు ముందు నిలబడాలి.
వెనక్కి తిరిగి నిలబడకూడదు కూర్చోకూడదు. అలానే పూజ చేసేటప్పుడు తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చుని పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రశాంతత కలుగుతుంది ఎంతో ఆనందంగా ఉండొచ్చు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. తూర్పు వైపు కూర్చుని పూజ చేయడం వల్ల ధైర్యం కలుగుతుంది.
పూజ చేస్తున్నప్పుడు గంట కొట్టడం కూడా చాలా మంచిది. ఉదయం సాయంత్రం పూజ సమయంలో గంట కొట్టండి. గంట కొట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఇలా ఈ విషయాలను ఫాలో అయితే ఇబ్బందులు పోయి ఆనందంగా ఉండేందుకు అవుతుంది.