అదిరే స్కీమ్.. రూ.2 లక్షల పైనే పెన్షన్…!

-

చాలా మంది వారి డబ్బులని ఆదా చేసుకుంటూ వుంటారు. ఇలా ఆదా చేసుకుంటూ ఉంటే భవిష్యత్తు ఇబ్బందే ఉండదు. అయితే మీరు ఏదైనా స్కీమ్ లో డబ్బులు పెట్టాలని అనుకుంటే కచ్చితంగా ఈ స్కీమ్ గురించి చూడాల్సిందే. కేంద్రం అందించే స్కీమ్స్ లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఒకటి. ఈ స్కీమ్ తో మంచిగా లాభాలు వస్తాయి.

దీనిలో దాచుకునే డబ్బులు డెట్, ఈక్విటీలోకి వెళ్తాయి. మీరు 75 శాతం డబ్బుల్ని ఈక్విటీలోకి పంపించుకోవచ్చు. మిగతా 25 శాతం డెట్‌లోకి వెళ్తుంది. నెలకు రూ.15,000 చొప్పున 30 ఏళ్ల పాటు పొదుపు చేస్తే మీకు అరవై ఏళ్ళు వచ్చినప్పటికి రూ.2 లక్షలకు పైనే పెన్షన్ వస్తుంది.

30 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వ్యక్తి నెలకు రూ.15,000 చొప్పున 30 ఏళ్ల పాటు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసారంటే… డెట్‌ 40 శాతం, ఈక్విటీ 60 నిష్పత్తి ఎంచుకుంటే 30 ఏళ్ల తర్వాత నెలకు రూ.68,380 పెన్షన్ ని మీరు పొందవచ్చు. మెచ్యూరిటీ సమయంలో రూ.2.05 కోట్లు మీకొస్తాయి. డబ్బు వెనక్కి తీసుకోకుండా సిస్టమెటిక్ విత్‌డ్రా ప్లాన్‌ను 25 ఏళ్లకు ఎంచుకుంటే వార్షిక వడ్డీ 8 శాతం అయితే నెలకు రూ.1.55 లక్షలు వస్తాయి. దీనికి అదనంగా పెన్షన్ వస్తుంది కనుక రూ.2 లక్షలకు పైనే ప్రతీ నెలా మీ ఖాతా లో పడతాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version