ఘనా దేశంలో భారీ పేలుడు…17 మంది దుర్మరణం

-

ఆఫ్రికా దేశం ఘనాలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు పదార్ధాలతో వెళ్తున్న ట్రక్.. టూవీలర్ ను ఢీకొట్టడంతో ఈ భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంతో 17 మంది దుర్మరణం చెందారు. 59 మంది గాయపడినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. పశ్చిమ ఘనాలోని ఓ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. రాజధాని అక్రాకు పశ్చిమాన 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొగోసో నగరానికి సమీపంలో ఈ భారీ ప్రమాదం సంభవించింది. పేలుడు ధాటికి అక్కడ పెద్ద బిలం ఏర్పడింది.

ఓ మైనింగ్ కంపెనీకి పేలుడు పదార్థాలతో వెళ్తున్న ట్రక్.. స్కూటర్ ని ఢీకొట్టడం, సమీపంలో ట్రాన్స్ ఫార్మర్ ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది. పేలుడు ప్రభావంతో సమీపంలోని ఇళ్లు దెబ్బతిన్నాయి. ఘనా అధ్యక్షుడు నానా అకుఫో-అడో ఘటనపై విచారకరం వ్యక్తం చేశారు దురదృష్టకర, విషాదకరమైన ఘటనగా వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version