ఏపీలోనూ ఘట్కేసర్ సీన్ రిపీట్.. ఫ్రెండ్ తో వెళ్లి కట్టు కధ !

-

విజయనగరం జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన యువతి కాళ్లు చేతులు కట్టేసి పడేసిన కేసులో మిస్టరీ వీడింది. కుటుంబ సభ్యులను నమ్మించేందుకు కాళ్ళు, చేతులు కట్టినట్లుగా కట్టు కథ అల్లినట్టు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెల్లడైంది. స్నేహితులతో కలిసి బైటకు వెళ్లిన విషయం ఇంట్లో వారికి తెలిసిపోతుందని అనంతరం వారు తిడతారని భావించి యువతి డ్రామా ఆడినట్టు గుర్తించారు పోలీసులు. కుటుంబ సభ్యులును నమ్మించేందుకు గాను తనకు తానే కాళ్ళు, చేతులు చున్నీతో కట్టుకొని, అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు నటించినట్లు ఎస్పీ రాజకుమారి పత్రికా ప్రకటన విడుదల చేశారు.

సదరు యువతి తనకు తెలిసిన స్నేహితుడిని కలిసేందుకుగాను ఫిబ్రవరి 27న హాస్టల్‌ నుండి చిన్నాన్న దగ్గరకు వెళ్తున్నట్లు అనుమతి తీసుకొని బయటకు వచ్చినట్లు గుర్తించారు. ఇదే సమయంలో హాస్టల్‌ లో తన గురించి తన అన్నయ్య వాకబు చేసినట్లు తెలుసుకుని తన స్నేహితుడిని కలిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఒక ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఎక్కిందని, గుర్ల దాటిన తరువాత బస్సు దిగిన ఆమె గుర్ల రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లోకి వెళ్ళి తన కుటుంబ సభ్యులు, స్నేహితులను నమ్మించేందుకుగాను తనకు తానే కాళ్ళు, చేతులను చున్నీతో కట్టుకొని, అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లుగా నటించిందని గుర్తించారు. ఈ మేరకు యువతి దర్యాప్తులో అంగీకరించినట్లు ప్రకటించారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version