అన్ని అనుమతులు ఉన్నా లంచం ఇవ్వలేదని GHMC సిబ్బంది తమ ఇంటిని కూల్చేశారని బాధితులు ఆరోపించారు. హయత్ నగర్ – అమన్గల్లోని లక్ష్మీప్రియ కాలనీలో ప్లాట్ కొనుగోలు చేసి.. G+2 కట్టుకోవడానికి అన్ని అనుమతులను తీసుకున్నామని బాధితుడు ఉమా మహేశ్వర రెడ్డి తెలిపారు.
అయినప్పటికీ, డబ్బులు ఇస్తేనే ఇల్లు కట్టుకోనిస్తానని ఎల్బీ నగర్ సర్కిల్-3 పట్టణ ప్రణాళిక శాఖ చైన్మాన్ సతీష్ కుమార్ వేధించారని.. తాను సామాన్య మధ్య తరగతి వ్యక్తిని అని, కొంత మొత్తంలో డబ్బులు ఇవ్వగలనని, ఇల్లు కట్టుకోవడానికి అడ్డుపడొద్దని ఉమా మహేశ్వర రెడ్డి వేడుకున్నారు. అడిగినన్ని డబ్బులు ఇవ్వడం లేదని టెంపరరీగా వేసుకున్న ఇల్లును తన మనుషులతో కలిసి సతీష్ కుమార్ కూల్చేశారన్నారు.తన దగ్గర అన్ని ఆధారాలున్నాయని ప్రభుత్వ పెద్దలు, ప్రతిపక్ష నాయకులు తనకు న్యాయం చేయాలని ఉమా మహేశ్వర రెడ్డి వేడుకున్నారు.
అన్ని అనుమతులు ఉన్నా కూడా లంచం ఇవ్వలేదని ఇల్లును కూల్చేసిన GHMC సిబ్బంది
హయత్ నగర్ – అన్మగల్లోని లక్ష్మీప్రియ కాలనీలో ఫ్లాట్ కొని, G+2 కట్టుకోవడానికి అన్ని అనుమతులను తీసుకున్న ఉమా మహేశ్వర రెడ్డి
అయినా డబ్బులు ఇస్తేనే ఇల్లు కట్టుకోనిస్తానని వేధించిన ఎల్బీ నగర్ సర్కిల్-3 పట్టణ… pic.twitter.com/iCMrOiwfD5
— Telugu Scribe (@TeluguScribe) May 4, 2025