నర్సంపేటలో ట్రాక్టర్ డ్రైవర్‌పై దెయ్యం దాడి..?

-

దెయ్యం దాడుల గురించి సినిమాల్లో చూడటమే తప్ప నిజజీవితంలో అందుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు. అయితే, వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో దెయ్యం దాడి చేసిందంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్నేళ్ల కిందట నర్సంపేట మున్సిపాలిటీలో విలీనం కాబడిన గ్రామంలో దెయ్యం గురించి ఊహాగానాలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నది.

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో గల ముత్తోజిపేట నుంచి ముత్యాలమ్మ తండా వైపునకు వెళ్లే దారిలో ఓ రైస్ మిల్లు వద్ద ఒక మర్రి చెట్టు ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండ్రోజుల కింద అర్థరాత్రి అటుగా వెళ్తున్న ఓ ట్రాక్టర్ డ్రైవర్‌పై దెయ్యం దాడి చేసి గాయపరించిందని సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చెందాయి. దీంతో స్థానికంగా ఈ ప్రచారం జోరందుకుంది. కానీ, గతంలో ఏనాడూ ఇలాంటి ఘటన జరగలేదని తోటి డ్రైవర్లు కూడా చెబుతున్నారు. ఇదంతా ఎవరో కావాలని పుకార్లు పుట్టించారని కొట్టిపారేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news