దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జ్‌పై నుంచి దూకి యువతి ఆత్మహత్య

-

హైదరాబాద్ మాదాపుర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకి యువతి ఆత్మహత్యకు పాల్పడింది. స్నేహితురాలితో కలిసి కేబుల్ బ్రిడ్జి పై నడుస్తూ ఒక్కసారిగా పై నుండి దుర్గం చెరువులోకి దూకేసింది. యువతిని ఆమె స్నేహితురాలు అపే ప్రయత్నం చేసినా వినకుండా బ్రిడ్జి పై నుంచి దూకేసింది. పోలీసులకు యువతి స్నేహితురాలు సమాచారం అందించింది. యువతి కోసం దుర్గం చెరువులో లేక్ పోలీసులు గాలిస్తున్నారు.

ఆత్మహత్యకు చేసుకున్న యువతి కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన పాయల్ (17)గా పోలీసులు గుర్తించారు. ఉద్యోగం నిమిత్తం నాలుగు నెలల క్రితం యువతి హైదరాబాద్కు వచ్చింది. ఇవాళ స్నేహితురాలితో కలిసి కేబుల్ బ్రిడ్జిపై నడుస్తూ ఒక్కసారిగా పైనుంచి దుర్గం చెరువులోకి దూకేసింది. చెరువులోకి దూకకుండా పాయలు.. ఆమె స్నేహితురాలు. ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే పాయల్ స్నేహితురాలు పోలీసులకు సమాచారం అందించారు. ప్రేమ వ్యవహారం విషయంలో.. యువతి తల్లిదండ్రులు ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు బావిస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version