చెవి నొప్పితో ఆసుపత్రికి వెళితే చేయి కట్‌ చేశారు..

-

చెవి నొప్పితో ఆస్పత్రికి వెళ్తే ఓ యువతి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టింది. వైద్యుల నిర్లక్ష్యం ఆ యువతి ప్రాణాలకే ప్రమాదం తీసుకొచ్చింది. చెవి నొప్పితో వెళ్లిన ఆమెకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి ఇంజక్షన్‌ వేయగా అది వికటించి ఆమె చేయి కోల్పోవాల్సి వచ్చింది. ఈ దారుణ ఘటన బిహార్‌లోని పట్నాలో జరిగింది.

శివహర్‌ జిల్లాకు చెందిన 20 ఏళ్ల రేఖ చెవి నొప్పితో పట్నాలోని మహావీర్‌ ఆరోగ్య సంస్థాన్‌ ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు జులై 11న శస్త్రచికిత్స నిర్వహించారు. వారు సూచించిన ఇంజక్షన్‌ను నర్సు రేఖ చేతికి వేసింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన రేఖకు ఎడమ చేయి రంగు మారడమే కాకుండా నొప్పి కూడా మొదలైంది. ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించగా.. కొద్ది రోజులకు అదే నయం అవుతుందని సర్దిచెప్పి పంపించేశారు.

ఆ తర్వాత కూడా నొప్పి తగ్గకపోవడం వల్ల రేఖ అనేక ఆస్పత్రుల చుట్టూ తిరిగింది. చివరగా పట్నాలోని మేదాంత ఆస్పత్రిలో చేర్పించారు. ఆగస్టు 4న శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. రేఖ ఎడమ చేయిని మోచేతి వరకు తొలగించారు. రేఖకు నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉండగా.. ఆమె చేయిని తొలగించడం వల్ల వరుడి కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేసుకొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version