కరోనా సోకిన యువతిపై బాత్‌రూమ్‌లోనే అత్యాచారం.. చివరికి ఇలా..!

-

కామాంధులు తమ కోరికలు తీర్చుకోవడానికి మరింత నీచానికి దిగజారుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఆఖరికి రోగులను సైతం విడవట్లేదు ఈ కీచకులు. తాజాగా క్వారంటైన్ కేంద్రంలో చికిత్స పొందుతున్న ఓ బాలికపై తన స్నేహితుడితో కలిసి బాత్‌రూమ్‌లోనే అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కీచకుడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఓ బాలిక(14)కు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆమెను అధికారులు చత్తార్‌పూర్‌లో ఉన్న సర్దార్ పటేల్ క్వారంటైన్ కేంద్రంలోకి తరలించారు. అదే కేంద్రంలోనే కరోనా సోకిన ఓ యువకుడు(20), అతడి స్నేహితుడు ఉన్నారు. అయితే ఆ యువకుడి కన్ను ఈ బాలికపై పడింది. ఏలాగైనా ఆ బాలికను అనుభవించాలని నిర్ణయించుకున్నాడు ఈ నీచుడు. ఈ క్రమంలో.. రాత్రి సమయంలో బాలిక కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్‌రూమ్‌ కు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన యువకుడు తన స్నేహితుడితో కలిసి బాలికపై బాత్‌రూమ్‌లోనే అత్యాచారం చేశాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version