ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్దిపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన జిఎన్ రావు కమిటి… ముఖ్యమంత్రి జగన్ ను తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో కలిసి తుది నివేదికను అందించింది. ఆయనతో సమావేశమైన కమిటి… తుది నివేదికను అందించింది. జిఎన్ రావు కమిటి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించి… రాజధానిపై వారి అభిప్రాయాలను సేకరించింది.
ఇప్పటికే దీనిపై మధ్యంతర నివేదికను అందించింది కమిటి. రాయలసీమలోని కర్నూలు, కోస్తాలోని గుంటూరు జిల్లా, ఉత్తరాంధ్రలోని విశాఖ సహా అనేక ప్రాంతాల్లో పర్యటించింది. దాదాపు 40 వేల వినతులను కమిటి స్వీకరించింది. అయితే కమిటి నివేదికలో ప్రజల అభిప్రాయం ఏంటి…? రాజధాని అమరావతి విషయంలో వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది అనేది ఆసక్తి కరంగా మారింది.
శాసన సభ సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ… రాష్ట్ర రాజధానిని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉందని, విశాఖ, అమరావతి, కర్నూలు పేర్లను చెప్పారు. కమిటి నివేదిక వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇప్పుడు ఈ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతలు కూడా జగన్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో రెండు రోజుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
కమిటి నివేదికను అఖిలపక్షానికి వివరించనున్న సర్కార్… జనవరి మొదటి వారంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 27 ముందు కేబినేట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో చర్చ తర్వాత కమిటి నివేదిక వెల్లడిస్తారు.
బ్రేకింగ్ : రాజధానిపై జగన్ కు జీఎన్ రావు కమిటీ తుది నివేదిక… దాంట్లో ఏముంది…!
-