మన దేశం టెక్నాలజీ పరంగా ఎంత డెవలప్ అయ్యిందో అందరికి తెలిసిందే..అంతే స్పీడుగా మూఢ నమ్మకాలు కూడా పెరుగుతున్నాయి.కొన్ని ప్రాంతాల్లో వింత ఆచారాలు పెరుగుతున్నాయి.వాటి వల్ల కొన్ని సార్లు ప్రాణాలు కూడా పోతున్నాయి.ఇక విషయానికొస్తే.. అనంతపురం జిల్లాలో వింత ఆచారం ఆసక్తికరంగా మారింది. ఈ జాతరలో పూజారి గుట్టగా వేసిన ముళ్ల కంపలపై ఎక్కి ఏకంగా పడుకుంటారు. అంతేకాదు గాలిలో పొడవాటి కర్ర పై పూజారిని కట్టి వలయాకారంలో తిప్పడం కూడా ఇక్కడ వింత ఆచారం..
బెలుగుప్ప మండలం బెలుగుప్ప తాండలో మారెమ్మ జాతర వినూత్నంగా సాగుతుంది. ఈ వేడుకను రెండు రోజుల పాటు వైభవంగా జరిగింది. ఈ జాతరకు ఉరవకొండతో పాటూ కర్ణాటక సరిహద్దు నుంచి గిరిజనులు వస్తారు.. జాతరను తిలకించేందుకు మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి ఏటా వేలాదిమంది ఇలా వస్తుంటారు. ఉదయం మహిళలచే పూర్ణ కుంభ కలశాలతో ఊరేగింపుతో ప్రారంభమైన ఈ జాతర కన్నుల పండుగగా జరిగింది..ఆ జాతరలో పూజారి గుట్టగా వేసిన ముళ్ల కంపలను ఎక్కుతూ వెళ్లి అటువైపు ఉన్న అమ్మవారిని దర్శించుకుంటారు.ఆ తర్వాత బాకులుగా ఉన్న ముళ్ల పై పడుకుంటారు.
అది కూడా డప్పు భక్తుల కేకల మధ్య ఈ ప్రధాన ఘట్టం జరుగుతుంది. అంతేకాకుండా ఒక ఇరుసు లాంటి ఏర్పాటులో పెద్ద కర్రకు పూజారిని కట్టి గాలిలో వలయాకారంలో సిరిమానోత్సవం కార్యక్రమం వంటి ఘట్టాలు తిలకించడానికి భక్తులు తరలి వచ్చారు. సాంప్రదాయంగా కొన్ని తరాలుగా వస్తోన్న ఈ ఆచారం చూడటం కోసం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చారు..ఇక పూజారి మాత్రం ఫోటోలకు పోజులు ఇవ్వడం గమనార్హం..ఏది ఏమైనా కూడా ఇలాంటి వాటికి చాలా ధైర్యం కావాలి..