BREAKING : భద్రాచలం వద్ద తగ్గిన ఉదృతి గోదావరి వరద

-

భద్రాచలం వద్ద గోదావరి మరింత తగ్గుముఖం పట్టింది. నిన్న స్వల్పంగా పెరిగిన గోదావరి మళ్లీ తగ్గుదల ప్రారంభమైంది. ఈరోజు ఉదయం వరకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 39.7 అడుగుల వద్ద ఉన్నది. గత రాత్రి నుంచి గోదావరి తగ్గటం ప్రారంభించింది. ఈనెల 11వ తేదీ నుంచి గోదావరి పెరుగుతూ వచ్చిన విషయం తెలిసింది. 71.3 అడుగులకి చేరుకొని మళ్లీ తగ్గి మళ్లీ పెరగటం ప్రారంభించింది.

గత పది రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న గోదావరి ఇప్పుడు 39 అడుగులకు తగ్గింది.గోదావరి ఉధృత రూపం దాల్చిన తరువాత ఇంత తక్కువగా తగ్గింది. ఇదే ప్రధమం. 15 రోజులుగా ఇంత తగ్గుదల ఇదే ప్రథమం . ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక దిగువ స్థాయికి గోదావరి తగ్గింది. 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హే హెచ్చరిక జారీ చేస్తారు. అయితే ఎగువ నుంచి భారీ వర్షాలు ఉన్నాయని అందువల్ల మళ్లీ వరదలు వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇంకా ప్రమాద హెచ్చరికల్ని మాత్రం అధికార యంత్రంగా ఉప సంహరించుకోలేదు. ప్రమాద హెచ్చరికల్ని ఇంకా కొనసాగిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version