బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. బంగారం, వెండి ధరలు రోజు రోజుకీ పెరిగి రికార్డు దిశగా దూసుకుపోతున్నాయి. కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కారణంగా బంగారం పెరుగుదలకు కారణంగా విశ్లేషకులు బావిస్తున్నారు. డాలర్ బలహీనపడటం, మదుపరులు బులియన్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపడంతో బంగారం, వెండి ధరలకు ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేస్తున్నాయి.
గత వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో ధరలు ఒకేలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకి 5,832 రూపాయలు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకి 5,351 రూపాయలకు చేరింది. ఇక మరోవైపు వెండి ధరలు చూస్తే కిలో పై రూ.2000 మేర పెరిగి రూ.73,500కి చేరింది. ఆగష్టు 1న పది గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు గాను రూ. 51,780, 24 క్యారెట్లకు రూ. 56,490 ఉన్నది. వారంలో రూ. 1830 పెరిగింది.