మ‌రో సారి క్షీణించిన బంగారం ధ‌ర‌.. వెండి మాత్రం..

-

నిన్న భారీగా క్షీణించిన బంగారం ధ‌ర ఈ రోజు కూడా త‌గ్గుద‌ల న‌మోదు చేసింది. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయలు తగ్గి 39,520 రూపాయలకు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 40 రూపాయలు తగ్గి 36,230 రూపాయలకు చేరింది. ఇక వెండి ధరలు భగ్గుమన్నాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 250 రూపాయలు పెరికి 46,900 వద్దకు చేరింది.

అలాగే ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు దిగివచ్చాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 50 రూపాయలు తగ్గింది. దీంతో 38,200 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50 రూపాయలు తగ్గడంతో 37,000 రూపాయల వద్దకు చేరింది. ఇక వెండి ధర కేజీకి 250 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో వెండి కేజీకి 46,900 రూపాయలకు చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version