వరుసగా మూడోరోజు కూడా బంగారం ధరలు పైకెగాశాయి. అయితే, రెండురోజులుగా స్వల్పంగా పెరుగుదల నమోదు చేసన బంగారం వెండి ధరలు ఈ రోజు భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు ఏకంగా 430 రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 41,660 నుంచి 42,090 రూపాయలకు ఎగసింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదేస్థాయిలో పెరుగుదల నమోదు చేసింది. 430 రూపాయలు పెరగడంతో 38,190 నుంచి 38,620 రూపాయల వద్దకు చేరుకుంది. బంగారం ధరలు భారీగా పెరిగితే అదే దారిలో వెండి ధరలు కూడా నడిచింది. కేజీ వెండి ధర 140 రూపాయల పెరుగుదలతో.. 49,060 రూపాయల నుంచి 49,200 రూపాయలకు చేరుకుంది.
ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు పైకెగాశాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇక్కడా 450 రూపాయలు పెరిగింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 40,650 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 450 రూపాయల పెరుగుదల నమోదు చేసి 39,450 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా స్వల్పంగా పెరిగింది. దాంతో వెండి ధర కేజీకి 49,200 రూపాయలుగా ఉంది.