పసిడి ప్రియులకి గుడ్ న్యూస్ : బంగారం, వెండి ధరలు ఢమాల్..!

-

పసిడి ప్రియులకు శుభవార్త. నిన్న కాస్త దిగొచ్చిన బంగారం ధర.. నేడు కూడా దిగొచ్చింది. వరుసగా రెండు పాటు క్షీణిస్తున్న బంగారం ధర చూసి గోల్డ్ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక బంగారం బాటలో నడిచిన వెండి ధర మరింత పడిపోయింది. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ. 780 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 55,460కు చేరింది.

అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల ధర రూ. 720 తగ్గడంతో రూ. 50,840కు చేరుకుంది. అయితే వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర రూ. 1100 తగ్గిపోయింది. దీంతో ధర రూ. 67,000కు చేరింది. అలాగే బంగారం ధర ఔన్స్‌ కు 1959 డాలర్లగా ఉండగా. వెండి ధర ఔన్స్‌ కు 27.53 డాలర్లకు చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version