లాక్‌డౌనకు భారీ సడలింపుల నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు లాభపడగా బంగారం ధరలు దిగివచ్చాయి. దీంతో హైదరాబాద్ లో బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10గ్రా బంగారం ధర నిన్నటి కంటే రూ.480 తగ్గి రూ.44,270 వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల 10గ్రా బంగారం ధర కూడా రూ.480 తగ్గి రూ.48,350 కి చేరింది. అలాగే కేజీ వెండి ధర నిన్నటి ధర కంటే రూ.1,080 తగ్గి రూ.47,400 వద్ద నిలిచింది.
ఇక విజయవాడ, విశాఖపట్నం విషయాలకొస్తే.. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు శనివారం నాటి ధర కంటే 490 రూపాయలు తగ్గుదల నమోదు చేసి, 44,280 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 1600 రూపాయల తగ్గుదల నమోదు చేసి 47,410 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 47,410 రూపాయల వద్దకు చేరింది. అదే విధంగా దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 290 రూపాయలు తగ్గి 45,010 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా 290 రూపాయల తగ్గుదల తో 46,210 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 1070 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 47 వేల మార్కుకు దిగి వచ్చి 47,410 రూపాయలుగా నమోదు అయింది.