బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్..

-

ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్‌ మరే వస్తువుకు లేదు. బంగారం డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ముఖ్యంగా మన దేశం లో అయితే.. బంగారానికి ఉన్న డిమాండ్‌ మరే దానికి లేదు. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు మహిళలు చాలా ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా చాలా మంది బంగారంపై పెట్టుబడి పెట్టడానికి చూస్తారు.

కరోనా ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధరలు విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు పెరగకుండా స్థిరంగా నమోదు అయ్యాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో గురు వారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,090 కు చేరింది. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44, 990 గా ప‌లుకుతుంది. అయితే… బంగారం ధరలు నిలకడగా నమోదు అయితే… వెండి ధరలు కూడా బంగారం బాటే పట్టాయి. తాజాగా ప్రస్తుతం హైదరాబాద్‌ లో కేజీ వెండి ధర రూ. 65,500 కు పలుకుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version