భారీగా పెరిగిన బంగారం ధర

-

గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఈ రోజు మాత్రం గట్టిగానే పెరిగాయి. అలానే నిన్న భారీగా పెరిగిన వెండి ధరలు మాత్రం ఈ రోజు పతనం అయ్యాయి. ఇక హైదరాబాద్‌ సహా విశాఖ పట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.370 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,920కి పెరిగింది. అలానే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,600కి పెరిగింది.

gold

అయితే ఢిల్లీ మార్కెట్‌ లో మాత్రం ఈ రేట్ భారీగా అంటే 1,370 మేర పెరిగింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.1,370 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.54,150కిచేరింది. అలానే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కూడా 350 పెరగడంతో రూ.49,650కి పెరిగింది. ఇక నిన్న భారీగా పెరిగిన వెండి ధరలు ఈ రోజు మాత్రం బాగా తగ్గాయి. తాజాగా మార్కెట్‌లో వెండి ధర రూ 700 మేర పెరిగింది. దీంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.61,200కు పడిపోయింది. బంగారం ధర మళ్ళీ తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని బులియన్ ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version