బంగారాన్ని అక్కడ దాచారు.. అయినా ఎయిర్‌పోర్టులో చిక్కారు!

-

బంగారం అక్రమ రవాణా కోసం స్మగ్లర్లు ఎన్ని ఎత్తులు వేసినా.. ఎయిర్‌పోర్టుల్లో కస్టమ్స్‌ అధికారులు వాటిని చిత్తు చేస్తూనే ఉన్నారు. అయినాసరే స్మగ్లర్లు ఏమాత్రం తగ్గడం లేదు. తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా చెన్నై ఎయిర్‌పోర్టులో ఇద్దరు స్మగ్లర్లు పట్టుబడ్డారు.

గల్ఫ్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు శనివారం రాత్రి చెన్నై ఎయిర్‌పోర్టులో దిగారు. వారి నడకతీరును అనుమానించిన కస్టమ్స్‌ డిపార్టుమెంట్‌ అధికారులు ఇద్దరినీ పక్కకు తీసుకెళ్లి తనిఖీ చేశారు. వారి శరీరంలో బంగారం ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ బంగారాన్ని స్మగర్లు మలద్వారంలో దాచారని తెలిసి షాకయ్యారు.

అనంతరం, కస్టమ్స్‌ అధికారులు.. స్మగర్ల మలద్వారం నుంచి దొంగ బంగారాన్ని వెలికితీశారు. మొత్తం 681 గ్రాముల బంగారం వారి నుంచి బయటపడింది. దాని విలువ 29 లక్షల 40 వేల రూపాయలుగా అధికారులు అంచనావేశారు. ఆ తర్వాత బంగారాన్ని సీజ్‌చేసి, నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version