న్యూఢిల్లీ: బంగారం కొనుగోలు దారులు, మహిళలకు ఇవాళ కాస్త ఊరట లభించింది. నాలుగైదు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు తాజాగా తటస్థంగా ఉన్నాయి. దేశంలో బంగారం, వెండి ధరలు ఈ రోజు నిలకడగా ఉన్నాయి. గురువారం సాయంత్రం ఏ రేటు ఉందో శుక్రవారం కూడా అదే ధర నడుస్తోంది.
ఇక వెండి ధరలోనూ మార్పు లేదు. ఈ రోజు వెండి కేజీ రూ. 74,100గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కేజీ వెండి రూ. 74,100గా కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు ధరలపై ప్రభావం చూపుతాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి…