బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

-

న్యూఢిల్లీ: పసిడి ప్రియులకు బంగారం షాకిచ్చింది. తాజాగా బంగారం ధర మళ్లీ పెరిగింది. దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.48,320గా ఉంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.200 పెరిగింది. దీంతో పసిడి రేటు 44 వేల 300 రూపాయలకు చేరింది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 48 వేల 330 రూపాయలు కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44 వేల 300 రూపాయలుగా విక్రయాలు జరుగుతున్నాయి.

ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450కు చేరింది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300‌గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300గా కొనసాగుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330 కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,450కు అమ్మకాలు జరుగుతున్నాయి.

బంగారం

వెండి కూడా బంగారం బాటలో నడిచింది. వెండి రేటు కిలో వెండిపై రూ.700 వరకు పెరిగింది. మరి కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా పెరిగింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.69,200కాగా.. ముంబైలో కిలో వెండి ధర రూ.69,200. చెన్నైలో కిలో వెండి ధర రూ.74,900.. బెంగళూరులో కిలో వెండి ధర రూ.69,200.

అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి రేటు పెరిగింది. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version