కరోనా గురించి గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా…

-

ప్రపంచం మొత్తం కరోన కోరల్లో చిక్కుకున్న సంగతి తెల్సిందే. ఈ నేపధ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ విధించినా కూడా రోజు రోజుకి కరోనా విస్తరిస్తుంది. అయినా అన్ని ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. దీని కోసం వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో అన్ని దేశాలు ఉన్నాయి. ఎన్ని పరిశోధనలు జరుగుతున్నా కూడా ఇంత వరకు ఏ దేశంలో కూడా మందుని కనిపెట్టలేదు. తాజాగా అమెరికా జరిపిన పరిశోధనల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

ఇప్పటి వరకు కరోనా పై జరిగిన పరిశోధనల్లో చాలా వరకు విజయవంతంగా జరుగుతున్నాయి. కరోనా ఏ విధంగా వ్యాపిస్తుంది, ఎన్ని రోజులు ఏ వస్తువు మీద జీవిస్తుంది అనే అంశాలు తెలిశాయి. ఇప్పుడు తాజాగా అమెరికా చేసిన పరిశోధనల్లో కీలక అంశాలు బయటపడ్డాయి. కరోన వైరస్ వేడి ప్రాంతాల్లో ఎక్కువ కాలం ఉండదని, చల్లటి ప్రదేశాల్లోనే జీవించగలదని తెలిసింది. సూర్యరశ్మిని, వేడిని కరోనా తట్టుకోలేదని అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యురిటి సైన్స్ అండ్ టెక్నాలజీ వెల్లడించింది.

ఇప్పటికే వేడి ఎక్కువగా ఉండే దేశమైన సింగపూర్ లో కరోనా తన శక్తిని కోల్పోతున్నట్లు తెలిపింది. అయితే ఇది మన దేశానికి శుభవార్త అనే చెప్పుకోవాలి. ఇప్పటికే భారత్ లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. దీని వలన మన దేశంలో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఉన్న కరోన బాధితులు కోలుకుంటే చాలు. కొత్త కేసులు నమోదు అయ్యే అవకాశo తగ్గుతుందనే చెప్పాలి. ఇప్పటికే తెలంగాణా ఆరోగ్య శాఖ మంత్రి ఈ విషయం పై క్లారిటి ఇచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version